PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనంత రీహాబిలిటేష‌న్ సెంట‌ర్‌ను ప్రారంభించ‌నున్న చిన‌జీయ‌ర్ స్వామి

1 min read

* 75 ప‌డ‌క‌లు, 125 మంది సిబ్బందితో స‌మ‌గ్ర సేవ‌లు

* రీహాబిలిటేష‌న్, పెయిన్ మేనేజ్‌మెంట్, ట్రాన్సిష‌న‌ల్ కేర్ సేవ‌లు

* ముఖ్య అతిథులుగా ప‌లువురు ప్ర‌ముఖులు

* వివ‌రాలు వెల్ల‌డించిన సంస్థ సీఈఓ డాక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్‌

పల్లెవెలుగు వెబ్ హైద‌రాబాద్ : మ‌న మ‌హాన‌గ‌రంలో ఉన్న1.31 కోట్ల మంది జ‌నాభాలో 28 ల‌క్ష‌ల మందికి, అంటే దాదాపు ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రికి వారి జీవితంలో ఏదో ఒక స‌మ‌యంలో రీహాబిలిటేష‌న్ సేవ‌లు అవ‌స‌రం. కానీ ఇప్పుడు 5,820 ప‌డ‌క‌లు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. ఈ కొర‌త‌ను కొంత‌మేర తీర్చేందుకు అనంత రీహాబిలిటేష‌న్, పెయిన్ మేనేజ్‌మెంట్ అండ్ ట్రాన్సిష‌న‌ల్ కేర్ సెంట‌ర్ ఏర్పాటు చేసిన‌ట్లు సంస్థ సీఈఓ, తెలంగాణ ఆరోగ్య‌శ్రీ ట్ర‌స్టు మాజీ సీఈఓ డాక్ట‌ర్‌ ఎం. చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు.  ఈ కేంద్రాన్ని 29వ‌తేదీ ఉద‌యం 10.30 గంట‌ల‌కు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన‌జీయర్ స్వామి ప్రారంభిస్తారు. కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా ఏఐజీ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి, కిమ్స్ ఎండీ డాక్ట‌ర్ భాస్క‌ర‌రావు, స‌న్ షైన్ ఎండీ డాక్ట‌ర్ గుర‌వారెడ్డి,  ప్రముఖ పారిశ్రామిక‌వేత్త జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు, ఎంపీ టీజీ వెంక‌టేష్‌, మాజీ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ లాంటి ప్రముఖులు పాల్గొంటారు. రీహాబిలిటేష‌న్ సేవ‌ల‌తో పాటు పాలియేటివ్ కేర్ సేవ‌లు కూడా అందించే ఈ ఆస్ప‌త్రిలో ప్ర‌ధానంగా డాక్ట‌ర్ అనూష కారుమూరి, డాక్ట‌ర్ కిషోర్ కారుమూరి, డాక్ట‌ర్ అజ‌య్, డాక్ట‌ర్ వెంక‌ట్‌, ఇంకా క్రిటిక‌ల్ కేర్ స్పెష‌లిస్టులు, జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్లు, ఇత‌ర వైద్యులు ఉంటారు. పూర్తిస్థాయి బ్యాక‌ప్ కార్డియాల‌జీ, వెంటిలేష‌న్‌, ఇత‌ర‌త్రా సేవ‌లు అందుబాటులో ఉన్నాయని అనంత ప్ర‌మోట‌ర్ డాక్ట‌ర్ ఎంఎస్ ఆనంద‌రావు వివ‌రించారు.అనంత రీహాబిలిటేష‌న్, పెయిన్ మేనేజ్‌మెంట్ అండ్ ట్రాన్సిష‌న‌ల్ కేర్ సెంట‌ర్ గురించి డాక్ట‌ర్‌ ఎం.చంద్ర‌శేఖ‌ర్‌ మాట్లాడుతూ, “రోజుకు 24 గంట‌లూ క్రిటిక‌ల్ కేర్ ఫిజిషియ‌న్లు, జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్లు క‌లిసి.. ఇన్ఫెక్ష‌న్ల‌తో బాధ‌ప‌డే రోగుల‌కు  పాజిటివ్, నెగెటివ్ ప్రెజ‌ర్ రూమ్స్‌లో చికిత్స‌లు అందిస్తారు. ప్ర‌తి ఒక్క రోగికి వారి అవ‌స‌రాల‌కు అనుగుణంగా ప్ర‌త్యేక ఆహారాన్ని అందించేందుకు డైటీషియ‌న్ సేవ‌లు ఉంటాయి. నొప్పి నివార‌ణ చికిత్స‌ల విష‌యంలో అంత‌ర్జాతీయంగా ప్ర‌త్యేక శిక్ష‌ణ పొందిన డాక్ట‌ర్ అనూష త‌ల నుంచి కాలి వేళ్ల వ‌ర‌కు శ‌ర‌రీంలో ఎక్క‌డ ఎలాంటి నొప్పి ఉన్నా న‌యం చేస్తారు. 75 గ‌దుల‌తో ద‌క్షిణ భార‌తంలోనే అత్యంత పెద్ద రీహాబిలిటేష‌న్ కేంద్రాల్లో ఇది ఒక‌టి అవుతుంది.  కార్డియాలజీ, రెస్పిరేట‌రీ, స్పోర్ట్స్ మెడిసిన్‌, న్యూరోస‌ర్జ‌రీ, ఆర్థోపెడిక్ లాంటి విభాగాల్లో శిక్ష‌ణ పొందిన 10 మంది ఫిజియోథెర‌పిస్టులు రోగుల‌కు న‌యం చేస్తారు” అని డాక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు.‘అనంతలో రోగులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించాం. ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు ఆయా రంగాలకు చెందిన అత్యుత్తమ వైద్యులు మా ద‌గ్గ‌ర ఉన్నారు. 75 పడకలతో, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వైద్యులు, సహాయక సిబ్బందితో సహా 125 మంది సిబ్బందితో కూడిన ఈ సదుపాయం ప్రస్తుతం వైద్య ఆరోగ్య రంగంలో ఉన్న అంతరాన్ని పూడ్చాలని లక్ష్యంగా పెట్టుకుంది’ అని అనంత రీహాబిలిటేష‌న్ సెంట‌ర్ర ప్ర‌మోట‌ర్ డాక్ట‌ర్ ఎంఎస్ ఆనంద‌రావు తెలిపారు. వైద్య, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. హైదరాబాద్ న‌గ‌రంలో వైద్య చికిత్స‌ల‌ అందుబాటుపై గణనీయమైన ప్రభావాన్ని చూపేందుకు అనంత రీహాబిలిటేష‌న్ సెంట‌ర్ సిద్ధంగా ఉంది. ఇది అత్యాధునిక సౌకర్యాలను అందిస్తుంది, సమాజానికి సేవ చేయడానికి అనుభవజ్ఞులైన నిపుణుల బృందాన్ని అందిస్తుంది.అత్యాధునిక ప‌రిక‌రాల సాయంతో నొప్పి నివార‌ణ‌కు అనంత‌లో ప‌లు ర‌కాల సేవ‌లు అందుతాయి. ఇక్క‌డ ఉన్న ఆధునిక ప‌రిక‌రాల్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేష‌న్ మిష‌న్లు, సి ఆర్మ్, అల్ట్రా సౌండ్ లాంటివి ఉన్నాయి. ఇవ‌న్నీ క‌లిసి దీర్ఘ‌కాలంగా ఉండే వెన్ను నొప్పి, మోకాలినొప్పి, ముఖం నొప్పుల‌ను, కేన్స‌ర్ వ‌ల్ల వ‌చ్చే నొప్పుల‌ను నివారించ‌గ‌లవు. యూనివ‌ర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్‌ , యూరోపియ‌న్ డిప్లొమా ఆఫ్ రీజ‌న‌ల్ ఎన‌స్థీషియా, ఇండియన్ పెయిన్ మెడిసిన్ లాంటి దిగ్గ‌జ సంస్థ‌ల‌లో శిక్ష‌ణ పొందిన అంత‌ర్జాతీయ నొప్పి నివార‌ణ వైద్యురాలు డాక్ట‌ర్ అనూష కారుమూరి నేతృత్వంలో నొప్పి నివార‌ణ విభాగం ప‌నిచేస్తుంది. అనంత‌లో ఉన్న విభిన్న‌మైన ఔట్ పేషెంట్ విభాగం అన్ని ర‌కాల సేవ‌లు అందిస్తుంది.

About Author