భారత యువకులపై చైనా కన్ను !
1 min readపల్లెవెలుగు వెబ్ : చైనా మరో కుట్రకు తెరలేపింది. తరచూ కయ్యానికి కాలు దువ్వుతూ భారత్ తో గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. ఇప్పుడు మరోసారి చైనా భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని 1126 కిలోమీటర్లు టిబెట్ సరిహద్దును ఆనుకుని ఉంటుంది. దీనిని చైనా దక్షిణ టిబెట్ లో భాగమని చెప్పుకుంటుంది. ఇది భారత్ లో భాగమని చైనా ఒప్పుకోదు. ఇప్పుడు మన దేశ సరిహద్దుల్లోని యువకుల్ని చైనా తన సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోకి చేర్చుకుంటోంది. టిబెట్ యువకుల్ని కూడ చైనా తన సైన్యంలో చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. దీని గురించి మాజీ ఎంపీ నిగోంగ్ ఈరింగ్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరారు.