చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాజీనామా ?
1 min readపల్లెవెలుగువెబ్ : చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారనే వార్త చైనా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, కరోనా కట్టడిలో విఫలం కావడం, చైనా ఆర్థికవ్యవస్థ పతనానికి జిన్పింగ్ తప్పుడు నిర్ణయాలే కారణమని ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవలే జరిగిన సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు.. చైనాలో కరోనా కట్టడి కోసం జిన్పింగ్.. జీరో కొవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.