చిన్నజీయర్ స్వామి క్షమాపణ చెప్పాలి !
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే పవిత్రమైన సమ్మక్క-సారక్క ఉత్సవాలను చినజీయర్ స్వామి హేళన చేస్తూ మాట్లాడడం అభ్యంతరకరమని సీపీఐ నేత నారాయణ చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమ్మక్క- సారక్క జాతరకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాదిమంది భక్తులు వస్తారని తెలిపారు. కొందరు ఈ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా భావిస్తే.. మరికొందరు పోరాట స్థలంగా భావిస్తారని చెప్పారు. పన్ను విధానాలపై ఆనాటి పాలకులతో పోరాటం జరిపే క్రమంలో సమ్మక్క-సారక్క వెలుగులోకి వచ్చారని గుర్తుచేశారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన సమ్మక్క- సారక్క ఉద్యమాన్ని హేళన చేస్తూ మాట్లాడిన చినజీయర్ స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు.