టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే
1 min read
సొంగ రోషన్ కుమార్ నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులకు కార్యకర్తలకు,అభిమానులు
ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీ 43,వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చింతలపూడి. శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అభిమానులు లింగపాలెం చింతలపూడి మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా 1982లో ఇదే రోజున ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారని చింతలపూడి శాసనసభ్యులు పార్టీ అభిమానులకు నాయకులకు గుర్తు చేశారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని ప్రజలకు సేవ చేయడం అని దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన ఎన్టీఆర్ నేర్పారని ఎమ్మెల్యే కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళాలి అంటూ ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో టీడీపీ నిమగ్నమై ఉందని రోషన్ కుమార్ హర్షంవ్యక్తం చేశారు. ఇక ముందు కూడా టీడీపీ ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తుందని చింతలపూడి ఎమ్మెల్యే స్పష్టం చేశారు.