NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చింతలపూడి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం ప్రచార జోరు..

1 min read

జనసంద్రంలా నామవరం గ్రామం 

కార్యకర్తల్లో జోష్ నింపిన మహిళలు

మీ ఆదరభిమానాలు ఎప్పటికీ మరువలేనన్న విజయ రాజు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : విజయోత్సవ ర్యాలీని తలపించే విధంగా సాగింది ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయ రాజు ఎన్నికల ప్రచారం జన సముద్రాన్ని తలపించింది. ఏ రోడ్డు ని చూసిన వైఎస్ఆర్సిపి జెండాల తో కళకళలాడింది. చింతలపూడి నియోజకవర్గంలోని నామవరం గ్రామం తమ నాయకుడు విజయ రాజు  ఎన్నికల ప్రచారానికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న నామవరం గ్రామ ప్రజలు రోడ్లపైకి ఘన స్వాగతం పలికారు. స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలు కదం తొక్కుతూ కోలాటం చేస్తూ ర్యాలీకి మరింత ఉత్సాహాన్ని కలిగించారు. మహిళలు. రోడ్డు పొడవునా నీరాజనాలు చేస్తూ పూల వర్షం కురిపిస్తూ పురవీధుల్లో కలయ తిరిగారు. గ్రామ ప్రజలు విజయరాజు  ప్రచారానికి స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో చిన్న పెద్ద తారితమ్యం లేకుండా మహిళలు వైయస్ఆర్సీపీ జెండాలు చేత పట్టి నాట్యాలు చేసుకుంటూ కేరింతలు కొట్టారు మహిళలు. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కుటుంబాన్ని పరామర్శించారు విజయరాజు త్వరలో మీ కుటుంబానికి అన్ని విధాల న్యాయం జరిగే విధంగా తాను ముందుంటానని మాట ఇచ్చారు. విజయ రాజునామవరం గ్రామ ప్రజలు చూపించిన ఈ అభిమానం, ఆప్యాయత ను తాను జీవితంలో మర్చిపోలేనని గ్రామంలో ఏ సమస్య ఉన్న వాటిని త్వరలో పరిష్కరించి, ప్రజల శ్రేయస్సు కోసం తాను అహర్నిశలు పాటుపడతానని విజయరాజు ప్రజలకు మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండల సభ్యులు కవురు శ్రీనివాస్, ఏలూరు పార్లమెంట్ వైసిపి అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ,వైసీపీ ప్రధాన కార్యదర్శి గోరుముచ్చు గోపాల్ యాదవ్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author