చిరంజీవి, బాలకృష్ణను టార్గెట్ చేసిందనుకోవడం లేదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. మంత్రి పేర్నినానితో చర్చలు సంతృప్తికరంగా సాగాయని తెలిపారు. సినిమా టికెట్ ధరలు గురించి ప్రధానంగా చర్చించానని వర్మ చెప్పారు. ధరల కేటాయింపు పై ఎవరికీ అధికారం ఉండకూడదని వర్మ అన్నారు. సినిమా టికెట్ ధరల అంశంతో పాటు మరో నాలుగు అంశాల గురించి ప్రధానంగా చర్చించినట్టు వర్మ తెలిపారు. రాజకీయ కక్ష్యసాధింపులో భాగంగా టికెట్ ధరలు తగ్గించిందన్న వాదనతో తాను ఏకీభవించనని వర్మ అన్నారు. కేవలం బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడానికే ప్రభుత్వం ఇలా చేసిందని తాను భావించనని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల అందరి సినిమాల పై ప్రభావం పడుతుందని అన్నారు.