PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘వైల్డ్ డాగ్’ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన చిరంజీవి

1 min read

నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు. ఏసీపీ అధికారి విజ‌య వ‌ర్మగా నాగార్జున న‌టించారు. దేశ‌భ‌క్తితో కూడ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంద‌ని, నాగార్జున ఎన‌ర్జీటిక్ గా, కూల్​గా క‌నిపిస్తుంటాడని అన్నారు చిరంజీవి. ఎటువంటి భ‌యం లేకుండా , అన్ని ర‌కాల బ్యాన‌ర్లలో సినిమాలు చేస్తున్నార‌ని ప్రశంసించారు. యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెర‌కెక్కనున్న వైల్డ్ డాగ్ మూవీలో .. ఎన్కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ గా నాగార్జున క‌నిపిస్తున్నారు. అహిషోర్ సాల్మన్ ద‌ర్శక‌త్వం వ‌హించ‌గా.. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న రిలీజ్ అవుతోంది.

About Author