PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరస్మరణీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు

1 min read

– ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అభివృద్ధికి పునరంకితమవుదాం
– జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు : ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు అని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు కొనియాడారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నగరం లోని చిల్డ్రన్ పార్క్ లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి నగర పాలక సంస్థ మేయర్ బివై.రామయ్య, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమీషనర్ భార్గవ్ తేజ తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కొండా రెడ్డి బురుజు వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పుష్పాంజలిఘటించారు.అనంతరం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పుష్పాంజలి సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమర జీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారని, వారి త్యాగం తోనే ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయనను స్మరించుకోవడం తెలుగువారిగా మన కర్తవ్యం అని కలెక్టర్ పేర్కొన్నారు…వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి పునరంకితం కావాలని అధికారులకు సూచించారు .. మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం తొలి రాజధాని కర్నూలు అని, అలాంటి జిల్లాకు కలెక్టర్ గా రావడం గర్వకారణం అని తెలిపారు.కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ బివై. రామయ్య మాట్లాడుతూ ఆ రోజుల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాషను అనుసరించి విడిపోయింది మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రం అని అన్నారు. మన ప్రయోజనాలను మనం కాపాడుకోవాలననే ఉద్దేశంతో అభివృద్ధి సాధించడం కొరకు పొట్టి శ్రీరాములు గారు ఆ కాలంలో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్షలో ప్రాణాలు అర్పించిన గొప్ప మహనీయులు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అదే స్ఫూర్తితో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారుజాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడులో మిళితమై మదరాసీలుగా పిలువ బడుతున్న తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేశారన్నారు.. వారి త్యాగం తో తెలుగు వారికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయిందని తెలిపారు.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కు మూల కారకుడు అమరజీవి పొట్టిశ్రీరాములు అని నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ పేర్కొన్నారు.

About Author