NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీఎన్ఆర్ కుటుంబానికి ‘చిరు’ సాయం..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ యాంక‌ర్, న‌టుడు తుమ్మల న‌ర‌సింహారెడ్డి (టీఎన్ఆర్) కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ల‌క్ష రూపాయ‌ల స‌హాయం అందించారు. ప్రముఖ సినీ జ‌ర్నలిస్టు సురేష్ కొండేటి ద్వార ఆర్థిక స‌హాయాన్ని అందించారు. టీఎన్ఆర్ భార్యతో ఫోన్ లో మాట్లాడిన మెగాస్టార్.. ఆమెకు దైర్యం చెప్పారు. టీఎన్ఆర్ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. మ‌రోవైపు ప్రముఖ న‌టుడు సంపూర్ణేష్ బాబు కూడ 50,000 రూపాయలు టీఎన్ఆర్ కుటుంబానికి ఆర్థిక స‌హాయం అందించారు. టీఎన్ఆర్ భార్య జ్యోతి అకౌంట్ కి .. సంపూర్ణేష్ బాబు ఆ డ‌బ్బును పంపించారు. టీఎన్ఆర్ కుటుంబానికి అండ‌గా ఉండేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలంటూ సంపూర్ణేష్ బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా పిలుపునిచ్చారు.

About Author