PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరు, ప‌వ‌న్ ఒకే సినిమాలో… !?

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ప్రముఖ ద‌ర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా #mega 154 వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంఛ్ అయింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణసార‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో చిరంజీవి పక్కా మాస్ పాత్రను పోషిస్తున్నారు. వైజాగ్ హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాకి ‘వాల్తేరు శీను’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో చిరంజీవి తమ్ముడిగా నటించేందుకు పవన్ కళ్యాణ్ ను బాబీ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. సినిమాలో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. దానికి చిరు సొంత తమ్ముడైతే ఇంకా బలంగా ఉంటుందని బాబీ ఆయన్ను సంప్రదించారట. మరి పవన్ దానికి ఒప్పుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నుక ఒప్పుకుంటే అభిమానుల‌కు పండ‌గే పండుగ‌. నెవ‌ర్ బిఫోర్ అన్నట్టుగా ఆ స్ర్కీన్ ఉంటుంద‌న్న దానిలో ఎలాంటి ఆశ్చర్యం అవ‌స‌రంలేదు.

About Author