NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిట్టెం రామన్న గెలిపు ఖాయం..

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:   కృష్ణ మండలం తెలంగాణ నర్వ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం లో బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో శ్రీ చిట్టెం సుచరిత రెడ్డి  మాట్లాడుతూ మండలంలో బూత్పూర్ సంగంబండ ఎత్తి పోతల పథకాలతో 24 గాం ఉచిత విద్యుత్ తో..రెండు పంటలకు నీరందిస్తూ… బీడు బారిన నేలను పచ్చగా చేసిన గణత మన బి ఆర్ ఎస్ ప్రభుత్వానిదే అని కొనియాడారు…అలాగే 24 గంటలు మనకు అందుబాటులో ఉండే చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి విజయం కోసం ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేసి కారు గుర్తుకు ప్రతి ఓటరు ఓటు వేసేలా కృషి చేసి అత్యదిక మెజార్టీ  మన నర్వ మండలం నుండి మనం పార్టీ కి వచ్చే విధంగా పని చేయాలని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలు చిట్టెం సుచరిత రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇస్తున్న  సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో ఏదో విధంగా అందుతున్నాయి.. ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధి తో పని చేయాలని… మనకున్న అతి కొద్ది సమయాన్ని ప్రజలతో గడిపి బి ఆర్ ఎస్ మ్యానిఫెస్టో ను  మరియు ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క ఓటరుకు క్లుప్తంగా అర్థమయ్యేలా వివరించాలని ప్రతి 100కు ఓట్ల ఇంచార్జీలు ఓటర్ల యొక్క సాధక భాధకాలను తెలుసుకొని మండల నాయకత్వానికి లేక మీ శాసనసభ్యులైన చిట్టెం రామన్నకి తెలియ చేసి వారి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తూ వారితో కారు గుర్తుకు ఓటు వేయించాలని వారు కోరారు ఈ మక్తల్ ల్లో ఎప్పుడు కనబడని ప్రతి పక్ష నాయకులు  ఓట్ల కోసం చిట్టెం రామన్న పై  అసత్య ప్రచారాలు చేస్తూ కుల మత రాజకీయాలు చేయడం సరి కాదని…కుల మత రాజకీయాలు చేసే ప్రతి పక్ష అబ్యర్థులకు ఈ ఓట్లప్పుడు కనబడుతున్న ఈ కుల మత ఓటర్లను ఇన్ని రోజులు ఎదుకు అడగలేదని….వారు ఎద్దేవా చేశారు ఇట్టి కార్యక్రమంలో మండలం ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్చార్జీలు 100 ఓట్ల ఇంచార్జీ లు మరియు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author