నిస్వార్థ నాయకుడిని ఎన్నుకోండి : టీజీ భరత్
1 min readకర్నూలు, పల్లెవెలుగు: ఒక్క ఓటు ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని.. అందుకే నిస్వార్థంగా పనిచేసే ప్రజా నాయకుడిని ఎన్నుకోవాలని కర్నూల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సూచించారు. శ్రీరామ్ నగర్‌లో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందన్నారు. సరైన నాయకుడు లేకపోతే ప్రజలకు ఇబ్బందులు ఉంటాయన్నారు. కర్నూలులో ఏ వీధికి వెళ్లినా తన తండ్రి టీజీ వెంకటేశ్ చేసిన అభివృద్ధి కచ్చితంగా కనిపిస్తుందన్నారు. అదేమాదిరిగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనను ప్రజలంతా గెలిపించాలని కోరారు. తాను రూపొందించిన 6 గ్యారెంటీలు అమలు చేయడం వల్ల కర్నూలు రూపురేఖలు మారిపోతాయన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తారని పేర్కొన్నారు. ఏపీకి చంద్రబాబు, కర్నూలుకు తాను అవసరమని.. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు గున్నామార్క్, ఆర్జా రామకృష్ణ, అజయ్, ఉదయ్ భాస్కర్, దాస్, మల్కల్, బాస్కర్, భరత్, ప్రేమ్, వర్ధన్, వినయ్, జుబేర్, మణి, ప్రదీప్, జనసేన నాయకులు పవన్, రమేష్, చందు, పండు తదితరులు పాల్గొన్నారు.