కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇకలేరు !
1 min read
పల్లెవెలుగు వెబ్: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయన కరోన బారినపడ్డారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస వదిలారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. విజయ్ శివశంకర్, అజయ్ శివశంకర్. ఇద్దరూ కూడ డ్యాన్స్ మాస్టర్లుగానే కొనసాగుతున్నారు. తమిళం, తెలుగు భాషలతో సహా 10 భాషల్లో ఆయన 800కు పైగా పాటలకు నృత్యాలు సమకూర్చారు. కొరియోగ్రాఫర్ గానే కాకుండా.. వెండితెర పై కూడ తనదైన ముద్ర వేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సోనూసూద్, చిరంజీవి, ధనుష్ లు శివశంకర్ మాస్టర్ కు అవసరమైన సహాయం చేశారు. అయినా కూడ ఆయన ప్రాణాలు దక్కలేదు. శివశంకర్ మాస్టర్ మరణంతో ఇండస్ట్రీలో విషాధ చాయలు నెలకొన్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.