చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవం .. రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు
1 min read– రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం నందవరం గ్రామం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి రాయబారధి, జ్యోతి, రథ, వసంతోత్సవంలో సందర్భంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రైతు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు మరియు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి జ్ఞాపకార్థం వీరి తల్లిదండ్రులు బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ఆయన సతీమణి కాటసాని జయమ్మ గారు సీనియర్ విభాగమునకు చెందిన మొదటి బహుమతి 80,000 వేల రూపాయలు, రెండవ బహుమతి 60,000 వేల రూపాయలు, మూడవ బహుమతి 50,000వేల రూపాయలు, నాలుగో బహుమతి 40,000వేల రూపాయలు, ఐదవ బహుమతి 30,000 వేల రూపాయలు, ఆరవ బహుమతి 20,000 వేల రూపాయలు, ఏడవ బహుమతి 15,000 వేల రూపాయలు, ఎనిమిదో బహుమతి 10,000 వేల రూపాయలు గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రకటించారు. నందవరం గ్రామ రైతు సంఘం పెద్దలు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శాలువా కప్పి పూలమాలతో సత్కరించి మెమెంటోలను అందజేశారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ఒక రైతుబిడ్డగా రాష్ట్ర ఎద్దుల పోటీలు నందవరం గ్రామంలో గ్రామ సంఘం వారు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి ఎద్దుల పోటీల్లో బల ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్క జట్టుకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాడు రైతు వ్యవసాయం చేసుకోవాలంటే ఎద్దులు లేనిదే వ్యవసాయం జరిగేది కాదు కాబట్టి అలాంటి ఎద్దులకు పోటీలు నిర్వహించడం అనాదిగా ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. అలాగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలో నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభ వెలికి తీయడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. తాను కూడా తన పెద్ద కుమారుడు స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక క్రీడా కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందవరం చౌడేశ్వరి దేవి పాలకమండలి మాజీ చైర్మన్ పి.ఆర్ వెంకటేశ్వర రెడ్డి జిల్లెళ్ల శంకర్ రెడ్డి, ఆల్లె సురేష్ కుమార్ రెడ్డి, బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ ఉపాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, నందవరం గ్రామ నాయకులు దశరథ రామిరెడ్డి ,పి ఆర్ చిన్న ఓబుల్ రెడ్డి (చిన్ని), వై రామారెడ్డి వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.