PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రపంచ మానవాళి కోసం బలి యాగమైన క్రీస్తు

1 min read

– గోనెగండ్ల లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్ల లోని స్థానిక క్రీస్తు సంఘము నందు గుడ్ ఫ్రైడే దినమును రెవరెండ్ పాస్టర్ ప్రసంగి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాక్యోపదేశం అందిస్తూ బలియాగం అనగా వధించబడుట, చంపివేయబడుట, ఎందుకు వధించబడాలి.సాధారణంగా మనుష్యుడు మాటలాడుట ద్వారాను, ఆలోచించుట ద్వారాను, చూచుట ద్వారాను, నడవడిక ద్వారాను పాపములు చేయుచున్నారు.పాపం అనగా దేవుడు చేయవద్దు అని చెప్పిన దానిని చేయటమే పాపమని, ఉదాహరణకు దొంగతనం చేయవద్దు అని దేవుడు అన్నాడు. దొంగతనం చేయుటయే పాపం కాబట్టి ఇలా అనేక పాపములు చేసి మనిషి మరణశిక్షకు పాత్రుడయ్యాడు అంటే నరకమునకు పోవుటకు పాత్రుడయ్యాడు. అలా నరకానికి జారిపోతున్న మనిషికి బదులుగా మనుష్య రూపము దాల్చి పరలోకము నుండి నరుడుగా 2023వ సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు జన్మించి 33½ సంవత్సరాలు బ్రతికి ఇటువంటి పాపము చేయకుండా పవిత్రముగా జీవించాడు. మనుషుల మైన మనము చనిపోతే నరకమునకు వెళ్లకూడదని మనకు రావలసిన శిక్షను తన ఎద మీద వేసుకొని మనకు బదులుగా ఏసుక్రీస్తు ప్రభువు సిలువలో బలియాగం అయ్యాడని, ఆయన సిలువలో చనిపోయి మనకు విడుదల కలుగజేశాడని లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. సమాధి చేయబడును. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడును అని 1కోరింది:5.3లో రాయబడిందని అన్నాడు.కావున మనుషులకు అగ్నిగుండంలో పడే అవకాశం తప్పించబడిన దినము గనుక ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుట ఎంతైనా అవసరము ప్రపంచ మానవాళి కొరకు ఏసుక్రీస్తు బలియాగం అయ్యాడు. ఆయన చనిపోయిన దినమును ఆనాటి రోమా చక్రవర్తి గుడ్ ఫ్రైడే (శుభ శుక్రవారం )గా ప్రకటించారని వివరించారు. అనంతరం ఏసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలను వివరించారు. అలాగే మండలంలోని అన్ని సంఘాలలో ఏసుక్రీస్తు గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author