NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ ఆధ్వర్యంలో… క్రిస్మస్ వేడుకలు

1 min read

పల్లెవెలుగువెబ్​, కడప: క్రీస్తు ప్రభువు మానవజీవితానికి పరమార్థం తెలిపేందుకుకన్య గర్భమున మనిషిగా జన్మించి ప్రపంచ ప్రజలకు గొప్ప దేవుడుగా నిలిచాడని .క్రిస్మస్ పండుగ ప్రపంచ ప్రజల పండుగని తెలుగుదేశం పార్టీ కడప అసెంబ్లీ ఇన్చార్జి వియస్ ఆమీర్ బాబు పార్టీ ప్రధాన కార్యదర్శి వికాస్ హరికృష్ణ నగర అధ్యక్షుడు సానపరెడ్డి శివ కొండారెడ్డి తో కలిసి  క్రైస్తవ మతం త్యాగనిరతికి విశ్వాసాలకు సేవా తత్వతకు ఆదర్శoగ నిలిచిన మతమని కొనియాడారు. ఏసు ప్రభువు జన్మను స్వాగతిస్తూ క్రిస్మస్ పండుగ వేడుకలను నగరంలోని  రైల్వే స్టేషన్ రోడ్డులోని ఆరోగ్య మాత ఆర్.సి.యం చర్చి నందు   తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు అధ్యక్షతన నిర్వహించారు   అనంతరం కేక్ కట్ చేసి బాలదాసుతో కలిసి అమీర్ బాబు  చర్చి ఫాదర్లు అబ్రహం అనిల్ సిస్టర్ల స్వప్న  ప్రమీల లూర్దు శాలువాలుగప్పి సన్మానించారు. క్రైస్తవామత విశ్వాసాలకు ఆదర్శంగా నిలిచిన నాయకుడు చంద్రబాబు నాయుడని ఆమురిబాలదాసు అన్నారు.అనంతరం చర్చి నిర్వాహకులు ఫాదర్ అబ్రహం ప్రార్థనలు నిర్వహించి విశ్వ మానవాళి ఏసుప్రభు దృష్టిలో సమానులన ప్రజలు సుఖశాంతులతో జీవించాలని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారు. కడప ప్రధాన టీడీపీ కార్యదర్శి వికాస్ హరికృష్ణ నగర అధ్యక్షుడు సానపు రెడ్డి శివ కొండారెడ్డి మైనారిటీ నాయకులు గగుటూరు నజీర్ ఇమ్రాన్ రెహమాన్ అజంతుల్లా రాయల్ కరిముల్లా నాదెల దస్తగిరి బీసీ సెల్ రాష్ట్ర నాయకులు  నబి కోటు శ్రీనివాసులు కొమ్మలపాటి సుబ్బరాయుడు జయశే కర్. కొండా సుబ్బయ్య  మేకల వెంకటేష్ యాదవ్ మురికినాటి సునీత రామాంజనేయులు. ప్రేమ కుమార్ చర్చి నిర్వాహకులు ఫాదర్ అబ్రహం అనిల్ సిస్టర్లు స్వప్న  ప్రమీల లూర్ధు తదితరులు పాల్గొన్నారు.

About Author