NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చర్చల్లేవ్.. 21న సమ్మె నోటీసు !

1 min read

పల్లెవెలుగువెబ్ : పీఆర్సీ పై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను బేషరతుగా రద్దు చేయాలని ఏపీ ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఎన్జీవో కార్యాలయం వద్ద పీఆర్సీ జీవోలను దహనం చేశారు. 11వ పీఆర్సీకి సంబంధించి అన్ని విషయాలు చర్చించినట్టు తెలిపారు. కొత్త పీఆర్సీ ప్రకారం ప్రతి ఉద్యోగికి రూ. 6 నుంచి 7 వేల వరకు జేబుకు చిల్లు పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని, ఉద్యోగులు తమ భవిష్యత్తును తాకట్టుపెట్టేందుకు సిద్ధం లేరని అన్నారు. పీఆర్సీ పై సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయని, 21న సీఎస్ కు సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు.

        

About Author