బాణసంచా యజమానులపై… సీఐ ఆగ్రహం..
1 min readపల్లెవెలుగు వెబ్, చెన్నూరు: మండల కేంద్రమైన చెన్నూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఎదురుగా ఏర్పాటుచేసిన బాణాసంచా స్టాల్స్ ను ఆదివారం సాయంత్రం సీఐ రవీంద్రనాథ్ రెడ్డి. చెన్నూర్ ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి పోలీసులు సందర్శించారు. స్టాల్స్ వద్ద నీళ్లు ఇసుక ఏర్పాటు చేయకపోవడం పై యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నూరు లో బాణాసంచా స్టాల్స్ వద్ద నీళ్లు ఇసుక ఏర్పాటు చేయకపోవడంతో యజమానులను సిబ్బందిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ ఆదేశాల ప్రకారం వెంటనే నీళ్లు ఇసుకను ఏర్పాటు చేశారు. ప్రతి దుకాణం వద్ద నీళ్లు ఇసుక తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా అమ్మి నట్లయితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. విజయవాడలో జరిగిన పేలుళ్ల సంఘటన బాణాసంచా స్టాల్స్ యజమానులకు వివరించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్లయితే బాధ్యత యజమానుల దేనని ఆయన హెచ్చరించారు. ప్రతి స్టాల్స్ వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే మోటార్ సైకిళ్ళు ఇతర వాహనాలను స్టాల్స్ వద్ద లేకుండా చేయాలని కోరారు. విద్యుత్ సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు పూర్తిగా రద్దు చేస్తామని వారు హెచ్చరించారు.