ఘనంగా సీఐ సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుక..
1 min read
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ సీఐ టి.సుబ్రహ్మణ్యం శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.సీఐ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జన్మదినం సందర్భంగా సీఐకు శుభాకాంక్షలు తెలిపేందుకు నందికొట్కూరు సర్కిల్ కార్యాలయం కిక్కిరిసి పోయింది.పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్.భూషి గౌడ్,సలీం భాష, అరవింద్ గౌడ్,వంశీ గౌడ్ సీఐకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా పాత్రికేయులు,పోలీస్ అధికారులు,ప్రజా సంఘాల నాయకులు,ప్రజలు నాయకులు,ప్రజా ప్రతినిధులు శాలువాలు పూలబోకెలతో సన్మానిస్తూ కేక్ కటింగ్ చేస్తూ సీఐకు శుభాకాంక్షలు తెలిపారు.