మాజీ సీఎంకు సీఐడీ నోటీసులు
1 min readహైదరాబాద్: రాజధానిలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులిచ్చారు. రెండు బృందాలుగా హైదరాబాద్ వెళ్లిన సీఐడీ అధికారులు … చంద్ర బాబుతో పాటు, మాజీ మంత్రి పి. నారాయణకు కూడ నోటీసులిచ్చారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నారాయణ పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకంగా పని చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 23న నారాయణ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియారావల్సి ఉంది.