PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CIPET అడ్మిషన్ టెస్ట్ 2021. ..

1 min read

పల్లెవెలుగు కర్నూలు : విజయవాడ లో గల భారత ప్రభుత్వ విద్యాసంస్థ- Central Institute of Petrochemicals Engineering & Technology (CIPET) లో 3 సం.ల వ్యవధి గల డిప్లొమా ఇస్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (DPT), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (DPMT) కోర్సులకు 10 వ తరగతి పాస్ అయిన విద్యార్ధులు, 2 సం.లు వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇస్ ప్లాస్టిక్స్ ప్రాసెస్సీంగ్ అండ్ టెస్టింగ్ (PGD-PPT) కోర్సుకు బి.యస్సీ పాస్ అయిన విద్యార్థుల నుంచి ఆన్లైస్ విధానం https://cipet.onlineregistrationform.org/CIPET/ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. SC & ST విద్యార్థులు Rs.250/-, OBC & Gen. విద్యార్ధులు Rs.500/- ఆన్లైన్ లో రుసుము చెల్లించి జూలై 3వ వారం లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏపీలోని విజయవాడ , అనంతపురంలో జూలై చివరి వారంలో CIPET ADMISSION TEST 2021 ఆన్లైన్ పరీక్ష జరుగుతుంది. పరీక్షకు సంబంధించిన మోడల్ ప్రశ్నాపత్రాలు ఆన్​లైన్​లో విద్యార్ధులకు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్ఞానభూమి వెబ్ సైట్ ద్వారా నిబంధనలను అనుసరించి అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పించింది. విద్యార్థినీ విద్యార్థులకు విడివిడిగా హాస్టల్ సదుపాయం కలదు. పై అన్ని కోర్సులకు ప్లాస్టిక్ మరియు అనుబంధ సంస్థలలో క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా దేశ విదేశాలలో ప్లాస్టిక్ వస్తువుల తయారీ, మౌల్ద్ తయారీ, టెస్టింగ్ & క్వాలిటీ నిర్ధారణ రంగాలలో మంచి ఉద్యోగ అవకాశములు కలవు. ఈ కోర్సులో చేరాలనుకునే కర్నూలు జిల్లా విద్యార్ధులు CIPET ప్రతినిధి B. శివ కుమార్ ని 9849263296 నెంబర్​లో సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు.

About Author