దొంగ నోట్ల చెలామణి పెరుగుతోంది.. తస్మాత్ జాగ్రత్త !
1 min readపల్లెవెలుగువెబ్ : దొంగ నోట్ల చెలామణి పెరుగుతోందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దొంగ నోట్ల చెలామణి రెట్టింపవుతోందని ఆర్బీఐ నివేదిక చెబుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థ మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 79,669 రూ. 500 డినామినేషన్ నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపని ఆర్‌బీఐ వార్షిక నివేదిక తెలిపింది. ఇక రెండువేల నోట్ల విషయంలో గుర్తించిన నకిలీ సంఖ్య 13,604గా ఉంది. 2020–21తో పోల్చితే ఈ సంఖ్య 54.6 శాతం అధికం. 2016లో అమలులో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు ప్రధాన లక్ష్యాలలో ఒకటి నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిని అరికట్టడం కావడం గమనార్హం.