చట్టభద్దంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఎన్నికలు
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఎన్నిక బైలా ప్రకారం 35 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నిక అయినా తరువాత కార్యవర్గ సభ్యుల చే అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి ఎన్నికలు జరుగుతుంది.కాని 35 మంది కి లోపు కార్యవర్గ సభ్యులు నామినేషన్ వున్న పక్షం లో కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా ప్రకటించవలెను. ఆ కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి ని ఎన్నుకొన్నారు. అదేవిధంగా మిగిలిన గవర్నింగ్ బాడీ ని ఎన్నుకోవడం జరిగింది.అని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర్ శర్మ తెలిపారు.కొంతమంది స్వార్థం తో సంఘం లో లెక్కలు చెప్పకుండా సంఘం కు రాజీనామా చేసి ప్రాథమిక సభ్యత్వం లేనివారు, సంఘం కు ఎటువంటి సభ్యత్వం లేనివారు ఎన్నికలు సక్రమంగా లేవనడం హాస్యాస్పదం. కోర్ట్ లో వివాదం కేసు నంబర్ sop 05/2021 గా నాలుగు సంవత్సరాలుగా pending లో వున్నందున ఎన్నికలు late అయింది అని తెలిపారు.ప్రస్తుతం 28 మంది సభ్యులు కల కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం బ్రాహ్మణ అభివృద్ధి కి బ్రాహ్మణ సమస్యల పరిస్కారం కు కృషి చేస్తుందని తెలిపారు.