NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిటీ బ‌స్సెక్కిన సీఎం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ పాల‌న‌లో త‌నదైన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠ‌మెక్కిన నాటి నుంచి కొత్త కొత్త నిర్ణయాల‌తో ప్రజ‌ల మ‌న్నన‌లు పొందుతున్నారు. తాజాగా ఆయ‌న సిటీ బ‌స్సులో కొంత‌సేపు ప్రయాణం చేశారు. ప్రయాణీకుల్ని ఆశ్చర్యప‌రిచారు. రాష్ర్టంలో టీకా పంపిణీ కార్యక్రమం చేప‌ట్టిన ఆయ‌న చెన్నైలోని క‌న్నాగి ప్రాంతంలోని వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లారు. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సులోకి త‌న కాన్వాయ్ ఆపి మ‌రీ ఎక్కారు. ప్రయాణీకుల‌ను స‌మ‌స్యలు అడిగి తెలుసుకున్నారు. బ‌స్సులు స‌మ‌యానికి వ‌స్తున్నాయా ?. మ‌హిళ‌ల‌కు ఉచిత టికెట్లు స‌రిగా ఇస్తున్నారా ?. ఉచిత టికెట్ల వ‌ల్ల ప్రయోజ‌నం ఉందా ?. అంటూ వారిని అడిగి తెలుసుకున్నారు. దీంతో సీఎంతో ఫోటోలు దిగేందుకు జ‌నం ఎగ‌బ‌డ్డారు.

About Author