20 న ‘ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్’ అంశంపై సిటీ స్థాయి వ్యాసరచన పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 117 ఎస్, అలియన్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ కర్నూల్ , నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని 20 వ తేదీ ఉదయం 9 గంటలకు సిటీ స్థాయి వ్యాసరచన పోటీలను ‘ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ ‘అనే అంశంపై నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్ పర్సన్ ,నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు నుంచి పది సంవత్సరాలలోపు చిన్నారులు సబ్ జూనియర్స్ గాను, 11 నుంచి 15 సంవత్సరాలలోపు వారిని జూనియర్స్ గాను ,15 సంవత్సరాల పైబడిన వారిని సీనియర్స్ గాను పరిగణిస్తారన్నారు. ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతితో పాటు కన్సోలేషన్ మరియు నగదు బహుమతులు ఉంటాయన్నారు. ఆసక్తిగలవారు 16 వ తేదీలోగా వెంకటరమణ కాలనీ మొదటి లైన్ లో ఉన్న నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని వివరాలకు 9396861308 నంబరునుసంప్రదించవచ్చు అని తెలిపారు.