ఎస్పీని కలిసిన నగర మేయర్
1 min readపల్లెవెలుగు వెబ్ : కర్నూలు జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డిని బుధవారం ఎస్పీ కార్యాలయంలోని నగర మేయర్ బీవై రామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా ఎస్పీకి తెలిపారు. మేయర్‌తోపాటు కర్నూలు జిల్లా వైఎస్సార్ సీపీ పార్టీ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.