టీడీపీ పిలుస్తోంది..నగరమా మేలుకో..!
1 min read–టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్
పల్లెవెలుగు: కర్నూలు నగరంలోని చిన్న మార్కెట్ ప్రాంతంలో తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని నేతలు కోరారు. కర్నూల్లో టి.జి భరత్ ను ఎమ్మెల్యే చేసుకుందామని ప్రజలతో చెప్పారు. కర్నూలు అన్ని రంగాల్లో డెవలప్మెంట్ అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. టి.జి భరత్ ను గెలిపిస్తే వార్డుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా పరిపాలన సాగిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతలు శేషగిరి శెట్టి, కుమార్, శ్రీనివాసులు, వెంకట లక్ష్మణ్, ఇక్విల్ బాషా, రాజేశ్వరమ్మ, సాయిరాం, విజ్నేశ్ ఆచారి, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.