టీచర్ల బదిలీలుపై స్పష్టత ఇవ్వాలి.. ఆపస్
1 min readపల్లెవెలుగు, వెబ్ విజయవాడ: రేపో అన్నట్లుగా అనేక మార్లు విద్యా శాఖ మంత్రి గారే ప్రకటించిన టీచర్ల బదిలీలు అసలు జరుగుతాయా లేదా జరిగితే ఉత్తర్వులు ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వాలి అని, సుదూర ప్రాంతాలలో పనిచేస్తూ ఎన్నో ఏళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న టీచర్లు ఎంతో మానసిక ఒత్తిడికి గరవుతున్నారు అని, ఇప్పటికే విద్యాసంవత్సరం సగం పూర్తయిందని, ఉపాధ్యాయులు వారి పిల్లల చదువులు, ఇతర విషయాలపై ఆందోళన లో ఉన్నారని ఇప్పటికైనా బదిలీలు చేపట్టక నెలల తరబడి బదిలీలపై నాన్చివేత దోరణి సరికాదని, వెంటనే బదిలీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సి హెచ్ శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ లు ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.అలాగే సిపియస్ ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఉపసహరించు కోవాలని, అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.అన్ని రాష్ట్రాలు సిపియస్ రద్దు చేస్తూ ఉంటే అన్ని రాష్ట్రాల కన్నా ముందు హామీ ఇచ్చిన మన ప్రభుత్వం రద్దు చేయక పోగా సిపియస్ ఉద్యోగులను వేదించడం సరికాదన్నారు. జీపీఎస్ అనే మాట మానుకొని సిపియస్ రద్దు చేసి ఓపియస్ అమలు చేయాలని సి హెచ్ శ్రావణ్ కుమార్ & యస్ బాలాజీరాష్ట్ర అధ్యక్షులు &ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేశారు.