‘సారంగ దరియా’పై స్పష్టత
1 min readనాగచైతన్య, సాయి పల్లవి నటించిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాలోని ‘సారంగదరియా’ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈపాట తనదే అని ఇటీవల కోమలి అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది. దీంతో సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ వివాదానికి సంబంధించి స్పష్టత ఇచ్చారు.
‘చాలా ఏళ్ళ కిందట ‘ రేలా రే రేలా’ ప్రోగ్రాంలో శిరిషా అనే అమ్మాయి ‘సారంగ దరియా’ అనే పాట పాడింది. ఆ పాట నాకు అలా గుర్తుండి పోయింది. ఆ పాట ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది. ఈ ఫిల్మ్ visualise చేస్తున్నప్పుడల్లా ఈ పాట నా mind లో తిరుగుతూనే ఉంది.
నా first film ‘dollar dreams’’ లో లక్కి అలి పాట ఉంటుంది. ఆ పాటని ఫిల్మ్ లో use చేసినందుకు SONY company కి నేను pay చేసా. ఫిల్మ్ లో credits కూడా ఇచ్చా. తర్వాత తీసిన ‘ఆనంద్’ లో లక్కి అలి తో పాడించుకున్నా కూడా. ఆనంద్ ఫిల్మ్ లో సుబ్బలక్ష్మి గారి పాట నుండి ఫిదాలో మల్లీశ్వరి సినిమా లో ని అప్పగింతల పాట వరకు స్టొరీ రాస్తున్నప్పుడు నాకు ఒకో సినిమా కి ఒకో పాట తిరుగుతుంటుంది. love story ఫిల్మ్ కి నా మనసులో ఈ పాట ఉంది.
సుద్దాల గారిని కలిసాను. ఈ పాటని film కి అనుకూలంగా రాయాలి అంటే.. ఈ పాట పల్లవి తీస్కొని, చరణాలు రాశారు. ఆ పాట కి అంత బాగా lyrics రాసినందుకు చాలా happy అయిపొయా.
మా టీం లో a.d ఒకరు sirisha ఫోన్ నంబెర్ సంపాదించి, ఆమెని contact చేశారు. ఆమెకి అప్పటికి delivery టైం అంటే.. మేము ఇంక సరే అనుకున్నాం. కరోన వల్ల ఫిల్మ్ ఆగి, మళ్ళీ షూట్ start అయ్యింది. new born baby తో ఉన్న శిరిషని ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు.
ఈ పాట ని నవంబర్లో షూట్ చేశాం. అది కూడా track singer పాడిన version తోనే. february ఆఖరులో మంగ్లి తో పాడించాం. promo రిలీజ్ అయ్యాక సుద్దాల గారు ఫోన్ చేశారు. ‘ఇద్దరు singers ఆ పాట మేమే పాడాలి అంటున్నరు అని’. ఇద్దరి నంబర్లు ఇచ్చారు. మా టీం లో a.d ఆ ఇద్దరితో మాట్లాడారు. నేను వెంటనే సుద్దాల గారి ఇంటికి వెళ్ళాను.
ఈలోగా ఆయన వివరాలు సేకరించి, ‘ ఆ ఇద్దరిలో కొమలే ఆ పాట ని వెలికితీసుకొచ్చింది, ఆమెతో పాడిద్దాం ’ అని సుద్దాల గారు అన్నారు. నా ముందే ఆయన కోమలకి ఫోన్ చేశారు. ‘ పాట రిలీజ్ చేస్తాం అని announce చేసాం కాబట్టి, కోమల ని వెంటనే రమ్మని’ అడిగాం. వరంగల్ నుండి రావటానికి ఏర్పాటు చేస్తాం అన్నాం. music director ని చెన్నయ్ నుండి రప్పించాం. ‘ జలుబు ఉంది, రాలేను’ అంది కోమల. పాట announce చేశాం కాబట్టి మా ఇబ్బంది చెప్పాం. తనకి credit ఇస్తే అభ్యంతరం లేదు అంది. ‘ genuine case sir, credit తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది ’ అని సుద్దాల గారు అన్నారు. కోమల ని అడిగితే, మీ ఇష్టం సర్, ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంది. కచ్చితంగా ఇస్తాం అని చెప్పాను.
audio function లో పాడమని, visibility బాగా ఉంటుంది అని, కచ్చితంగా రమ్మని నేనే కోమలకి చెప్పాను. ఆమె సరే అంది.
సుద్దాల గారి ఇంటి నుండి ఫోన్లో కొమలతో చెప్పినట్టుగానే.. పాట రిలీజ్ చేసినప్పుడు – facebook లో కోమల ki thanks చెప్పాను.
మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమల కి మేం promise చేసినట్టు ఫిల్మ్ లో credit ఇస్తాం, money ఇస్తాం, audio function fix అయితే , కోమలకి పాడమని invitation పంపిస్తాం.
post production పనుల్లో పడి నేను టివి ల్లో జరుగుతున్న చర్చలు follow కాలేదు. ఒకేసారి facebook లో అందరికి information ఇస్తున్నాను’ అని తెలిపారు శేఖర్ కమ్ముల. ఫేస్ బుక్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు.