NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మద్యం దుకాణం వద్ద గొడవ ..ఒకరికి గాయాలు

1 min read

పల్లెవెలుగు ,వెబ్ గడివేముల : మండల కేంద్రంలో ఉన్న మద్యం దుకాణం వద్ద తాగి కొట్టుకున్న యువకులు బుజనూరు గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే యువకుడ్ని తాగిన మైకంలో గొడవ పడి పిడుగుద్దులు గుద్దుతూ చావ బాదడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు బిలకల గూడూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఈ దాడిలో పాల్గొన్నట్టు పేర్కొంటున్నారు .. అటువైపు వెళుతున్న కొంతమంది వీడియో తీయడంతో మండలంలో వీడియో క్లిప్పింగ్ హల్చల్ అయింది బహిరంగంగా మద్యం తాగడం రోడ్డుపై నానా రభస చేయడం నిత్య కృత్యమైందని మందుబాబుల ఆగడాలు బస్టాండుకు చుట్టుపక్కల ఉన్న బ్యాంకు కార్యకలాపాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఇబ్బందులకు గురవుతున్నారని మండల వాసులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా పనిచేయాలని మండల ప్రజలు కోరుతున్నారు గాయపడ్డ యువకుడ్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ తరలించారు.

About Author