వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ
1 min read
పల్లెవెలుగువెబ్ : విజయవాడలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన జెండా దిమ్మెను ధ్వంసం చేసేందుకు వైసీపీ నేతల యత్నించడంతో జన సేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. జనసేన నాయకుడు పోతిన మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పోలీసులు వైసీపీకి మద్దతుగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.