NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు నిర్వహణ

1 min read

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్​ నేడు: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో  నిర్వహించామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.మంగళవారం ఉదయం  నగరంలోని పాత పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న  దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న తీరును   కలెక్టర్  పరిశీలించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఎలాంటి  మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు ముగిశాయని తెలిపారు.  ఎస్ ఎస్ సి  పబ్లిక్ పరీక్షల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లు కి కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారన్నారు. ఈ ఏడాది పరీక్షలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఏ చిన్న ఘటన కూడా జరగకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ విద్యాధికారులకు సూచించారు. తనిఖీ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. ఈ ఏడాది సమస్యాత్మక కేంద్రాలలోనూ ఏ చిన్న ఘటన జరగకుండా పరీక్షలు నిర్వహించామని కలెక్టర్  వివరించారు.

About Author