ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలియజేశారు.బుధవారం ఉదయం నగరం లోని రాజానగర్ లో గల బిషప్ సెంట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గౌతమి నగర్ లోని గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మార్చి 17 వ తేది నుండి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల కోసం 172 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.172 పరీక్ష కేంద్రాలలో 40,776 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని కలెక్టర్ తెలిపారు.. 208 మంది పరీక్షకు గైర్హాజరు జిల్లా వ్యాప్తంగా బుధవారం 208 మంది రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ లో 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. 172 కేంద్రాలలో ఎలాంటి సంఘటనలు జరగలేదని, మిగతా పరీక్షలు కూడా ప్రశాంత వాతావరణలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ను ఆదేశించారు.