విద్యార్థులకు తరగతి గదులు లేక ఇబ్బందులు
1 min read– అదనపు గదుల నిర్మాణంలో జాప్యం
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: మండల కేంద్రమైన చెన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదులు లేక నిర్మాణం లో ఉన్న గదులలో నేలపై విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఇటీవల మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలకు విలీనం చేయడంతో సరైన గదులు లేక మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత పాఠశాలలో అదనపు గదులు మౌలిక సదుపాయాల కోసం రెండేళ్ల కిందట నా బార్డు నిధుల నుంచి కోటి 94 లక్షల రూపాయలు నిధులు మంజూరు కాగా పాఠశాలలో పాత తరగతి గదుల మరమ్మతులు అదనపు గదులు నిర్మించేందుకు టెండర్లు పిలవడం జరిగింది. కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్న గుత్తేదారు నిర్మాణ పనులను కొనసాగిస్తూ అర్ధాంతంగా పనులు ఆపేసి వెళ్లిపోయారు. తిరిగి మరోసారి టెండర్లు పిలవడంతో పనులు తగ్గించుకున్న గుత్తేగారు అదనపు గదులు నిర్మాణంలో జాప్యం చేయడంతో పనులు ముందుకు సాగడం లేదు. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం విద్యార్థులకు ఉపాధ్యాయులకు సమస్యగా మారింది. ఈ విషయంపై బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ పద్మనాభం వివరణ కోరగా భవన నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు సంబంధిత గుత్తేదారిపై ఒత్తిడి చేస్తున్నామని త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.