మాధవరం గ్రామంలో వాటర్ ట్యాంక్ లు క్లీనింగ్
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: వాటర్ ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ గ్రామంలోని ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలన్నదే మా సంకల్పమని పంచాయతీ కార్యదర్శి పార్థసారధి రెడ్డి, మాధవరం పంచాయతీ సర్పంచ్ ఎం. లక్ష్మీనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్యాపిలి మండల పరిధిలోనిమాధవరం గ్రామంలో వాటర్ ట్యాంక్ లు క్లీనింగ్ చేపించడం జరిగింది. కార్యదర్శి పి. పార్థసారథి రెడ్డి మరియు సర్పంచ్ ఎం. లక్ష్మీనారాయణ లు మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీరు ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా ఎప్పటికప్పుడు బోర్లను మరమ్మతులు చేపించి వాటర్ ట్యాంకులను శుభ్రపరుస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నామని, వేసవికాలంలో ప్రజలకు సక్రమంగా త్రాగునీరు అందించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం పాటించకుండా విధులను సక్రమంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.