‘ స్పందన’ బియాండ్ ఎస్ఎల్ఏ అర్జీలను వెంటనే క్లియర్ చేయండి
1 min read– జేసీ(అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలాని సామూన్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో వచ్చే బియాండ్ ఎస్ ఎల్ ఎ అర్జీలను వెంటనే క్లియర్ చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులు, తాసిల్దార్ లు ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, డిఆర్వో పుల్లయ్య, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ వివిధ శాఖలలో పెండింగ్లో ఉన్న స్పందన బియాండ్ ఎస్ ఎల్ ఎ అర్జీలు వెంటనే క్లియర్ చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు జిల్లాలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాలను విజిట్ చేసి రిపోర్టును ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. రైతు భరోసా,వైయస్సార్ చేయూత, వైయస్సార్ వాహన మిత్ర, జగనన్న తోడు, నేతన్న నేస్తం, కాపు నేస్తం, పథకాలకు సంబంధించి డిజిటల్ పేమెంట్స్ వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లకు అందజేసిన మొబైల్ ఫోన్లు మరమ్మతులకు గురై నట్లయితే వారంటీ ఉన్న మొబైల్స్ జిల్లాలోని జియోమీ సర్వీస్ సెంటర్ల ద్వారా ఉచితంగా రిపేర్ చేయించుకోవచ్చునన్నారు.