15లోగా భూమి రికార్డులు స్వచ్ఛీకరణ చేయండి
1 min readజాయింట్ కలెక్టర్(రెవెన్యూ మరియు రైతు భరోసా) రామసుందర్ రెడ్డి
పల్లెవెలుగు కర్నూలు : జూన్ 15వ తేది లోగా ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామానికి సంబంధించి భూమి రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తి చేయాలని సర్వే శాఖ అధికారులకు ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం పురోగతి పై సర్వే శాఖ ఎడి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, కర్నూలు ఆర్డిఓ హరిప్రసాద్, కలెక్టరేట్ లోని డిప్యూటీ తహశీల్దార్లతో జాయింట్ కలెక్టర్(రెవెన్యూ మరియు రైతు భరోసా) రామసుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ సర్వేకు సంబంధించి 54 గ్రామాలలో గ్రామ సరిహద్దులు. వైఎస్సార్ జగనన్న భూరక్ష హద్దు రాళ్లు నాటి, హద్దు రాళ్లు నాటడానికి ఎక్కడైనా భూములలో కంప ఎక్కువగా వుంటే ఉపాధి హామి పథకం ద్వారా కంపళ్లు తొలిగించి హద్దు రాళ్లు నాటాలని సర్వే శాఖ అధికారులకు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామసుందర్ రెడ్డి ఆదేశించారు. 54 గ్రామాలలో 19 గ్రామాలలో డ్రోన్ సర్వే పూర్తి చేశారని మిగిలిన గ్రామాలలో కూడా డ్రోన్ సర్వే పూర్తి చేయాలని సర్వే శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, కర్నూలు ఆర్డిఓ హరిప్రసాద్, సర్వే శాఖ ఎడి హరిక్రిష్ణ, డిప్యూటీ తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.