భూ రికార్డుల స్వచ్చీకరణ త్వరితగతిన పూర్తి చేయాలి
1 min read– జేసీ (రెవిన్యూ మరియు రైతుభరోసా) రామసుందర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: రెవెన్యూ సిబ్బంది భూరికార్డుల స్వచ్చీకరణ త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతుభరోసా) రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు పి ఓ ఎల్ ఆర్( ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్) భూరికార్డుల స్వచ్చీకరణపై డిప్యూటీ తాసిల్దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు మరియు సిబ్బంది భూరికార్డులలో ఎటువంటి పొరపాట్లు లేకుండా భూముల వివరాలు నమోదు చేయాలన్నారు.
భూరికార్డుల స్వఛీకరణపై త్వరలో కర్నూలు, నంద్యాల, ఆదోని, డివిజన్లకు సంబంధించి డిప్యూటీ కలెక్టర్లు, తాసిల్దార్ లతో వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. భూరికార్డుల స్వఛీకరణలో ఎటువంటి సాంకేతిక సమస్యలున్నా వెంటనే తమకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, డిప్యూటీ తాసిల్దార్ లు, సాంకేతిక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.