కొండెక్కిన టమోట.. కొనలేం, తినలేం !
1 min readపల్లెవెలుగు వెబ్ : టమోట ధరలు కొండెక్కాయి. ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు తినలేని పరిస్థితి. కొనలేని పరిస్థితి. సప్లై తక్కువ కావడంతో టమోట ధరలు పెరుగుతున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్‌లో శనివారం మొదటి రకం టమాటా కిలో రూ.74 పలికింది. గతంలో ఎన్నడూలేని విధంగా ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాంతాల్లో టమాటా పంట దెబ్బతింది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. శనివారం మార్కెట్‌కు కేవలం 157 మెట్రిక్ టన్నుల సరకు మాత్రమే వచ్చింది. సరుకు తక్కువ రావడంతో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధరలు మరింత పుంజుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లితే.. మరికొన్ని ప్రాంతాల్లో రైతులకు మేలు జరుగుతోంది. టమోట పంట ఉన్న రైతులకు లాభాల వర్షం కురుస్తోందని చెప్పుకోవాలి. 30 కేజీల బాక్స్ 2200 దాక పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.