ప్రాఫిట్ బుకింగ్… నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్ మార్కెట్
1 min read
పల్లెవెలుగు వెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిసాయి. ఉదయం స్వల్ప లాభంతో ప్రారంభమైన సూచీలు.. ఫ్లాట్ గా కొనసాగాయి.. అనంతరం చివరి గంటలో లాభాల స్వీకరణతో నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్స్, ఫైనాన్షియల్ రంగాల్లో లాభాల స్వీకరణతో ఇండెక్స్ లు నష్టాలతో ముగిసాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. సెన్సెక్స్ 206 పాయింట్ల నష్టంతో 61,143 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల నష్టంతో 18211 వద్ద , బ్యాంక్ నిఫ్టీ 364 పాయింట్ల నష్టంతో 40874 వద్ద ట్రేడింగ్ ముగించింది.