PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘విలీనం’ తో పాఠశాలలు మూసివేయడం దారుణం: DYFI

1 min read

పల్లెవెలుగు వెబ్​:రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాటశాలలు విలీనం పేరుతో మూసివేయడం దారుణం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీ.ఓ నెంబర్ 117 ను ఉపసంహరించుకోవాలని అని భారత విద్యార్థి ఫెడరేషన్(SFI), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(DYFI) ఆధ్వర్యంలో GO.NO. 117  పత్రాలను  పద్మావతి నగర్ అర్చ్ వద్ద దగ్దం చేశారు. ఈ సందర్భంగా DYFI జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, SFI జిల్లా కార్యదర్శి నిరంజన్ DYFI పట్టణ కార్యదర్శి శివ, మాట్లాడుతూ గ్రామాలలో మరియు పట్టణాలలో పాఠశాలలు ముసివేయవద్దని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా,జిల్లా లో కూడా విద్యార్థులు,తల్లిదండ్రులు వివిధ రూపాలలో ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. జీఓ 117 రద్దు చేయాలని మరోవైపు ఉపాద్యాయులు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.3.4.5 తరగతులను పాఠశాలలలో విలీనం వలన ఉపాద్యాయులు,విద్యార్థుల నిష్పత్తి 1:40 నుండి 1:60 కి పెరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 వేల పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది అని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ఇప్పటికే అన్ని సబ్జెక్టులకు ఉపాద్యాయులు లేరన్నారు. ఈ పరిస్తితులలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విలీన ప్రక్రియ ఏ రకంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఇవ్వగలరో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.3.4.5 తరగతుల విలీన ప్రక్రియ వలన వేలాది మంది విద్యార్థులు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది అన్నారు. డ్రపౌట్ లు పెరిగే ప్రమాదం వున్నదని అమ్మాయిలు చదువు మనుకునే పరిస్తితి వస్తుంది అన్నారు.భవిష్యత్ లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ వుండవన్నారు.ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు DSC కోసం ఎదురు చూస్తున్నారు అన్నారు.వారందరికీ అన్యాయం చేసినట్టు అవుతుంది అన్నారు.కార్పొరేట్ల కు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన  జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించ కుండ పూర్తి స్థాయిలో అమలు చేయడాన్ని DYFI, SFI విద్యార్థి, యువజన సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నము అన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల  విలీనాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు.కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు సాయికుమార్,  నాయకులు జగదీశ్వర్ రెడ్డి, దస్తగిరి, కేశల్ నాయక్, సుమంత్, మహేష్, సుభాష్, ఇతరులు పాల్గొన్నారు.

About Author