PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత

1 min read

పల్లెవెలుగు, వెబ్​ రుద్రవరం: చంద్రగ్రహణంతో మండలంలోని ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. మండల కేంద్రంలో ని శ్రీ భాస్కరనందీశ్వర స్వామి శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ( అమ్మవారి శాల ) శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం శ్రీ కాశీ విశ్వేశ్వర ఆంజనేయ స్వామి ఆలయం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం శ్రీ రామాలయం శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ సాయిబాబా ఆలయం ఆలయం వెలగలపల్లె గ్రామం పొలిమేరలో వెలిసిన శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి శ్రీ మానస లింగేశ్వర స్వామి ఆలయాల తో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో వెలసిన పలు ఆలయాలను మూసివేశారు. మంగళవారం చంద్రగ్రహణం రావడంతో ఆలయాలలో భక్తులు ప్రవేశం చేయకుండా ఆలయ నిర్వాహకులు ప్రధాన అర్చకులు ఆలయాల ప్రధాన ముఖ ద్వారాలు మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాల ప్రధాన ద్వారాలు మంగళవారం ఉదయం నుండి మూసి వేశామని తిరిగి మరల బుధవారం రోజున ఆలయ సంప్రోక్షణ పూజల అనంతరం ఆలయాల తలుపులు తెరవడం జరుగుతుందని తద్వారా స్వామివార్లను దర్శించుకోవడానికి భక్తులకు ప్రవేశం ఉంటుందని ఆలయ నిర్వాహకులు ప్రధాన అర్చకులు తెలిపారు.

About Author