PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చైనా, తైవాన్ మ‌ధ్య యుద్ధ మేఘాలు.. అమెరికా అండ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చైనాను రెచ్చగొడుతూ, ఉద్రిక్తతలను మరింతగా పెంచుతూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ (82) తైవాన్‌ పర్యటన బుధవారం ముగిసింది. ‘‘తైవాన్‌కు అమెరికా అన్నివిధాలా అండగా నిలుస్తుంది. అందుకు మేం కట్టుబడ్డామని ఈ పర్యటనతో మరోసారి చాటిచెప్పాం’’ అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. తైవాన్‌ తన భూభాగమేనని, దానితో ఏ దేశమూ సంబంధాలు పెట్టుకోరాదని చెబుతున్న చైనా ఈ పరిణామంపై మండిపడింది. ‘‘పెలోసీ నిప్పుతో చెలగాటమాడారు. అది అమెరికానే కాల్చేస్తుంది. తీవ్ర పరిణామాలుంటాయి. చేతులు ముడుచుకుని కూర్చోం’’ అంటూ చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి జీ ఫెంగ్‌ స్పందించారు. ఈ తప్పిదానికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘‘చైనా సార్వభౌమాధికారాల పరిధిని, ప్రాదేశిక సమగ్రతను అమెరికా ఉల్లంఘించింది. తైవాన్‌ జలసంధి వద్ద శాంతిభద్రతలను పూర్తిగా దెబ్బతీసింది’’ అని విమర్శించారు.

                                     

About Author