PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిద్ధూకు పాదాభివందనం చేసిన సీఎం అభ్యర్థి !

1 min read

పల్లెవెలుగువెబ్ : పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించే సందర్భంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా.. అభ్యంతరం లేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ సిద్ధూ ప్రకటించడంతో ఆసక్తికరంగా మారింది సీన్‌. ఈ తరుణంలో.. స్టేజ్‌పై సీఎం అభ్యర్థిగా చన్నీ పేరును ప్రకటించిన వెంటనే ఆసక్తికర దృశ్యం కనిపించింది. సిద్ధూ చన్నీ కుడి చెయ్యిని పైకి ఎత్తగా.. ఆక్షణంలోనే చన్నీ తన ఎడమ చేతితో సిద్ధూకి పాదాభివందనం చేశాడు. ‘సిద్ధూజీ.. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసేయండి. మీ మోడల్‌ కచ్చితంగా అమలు అయ్యి తీరుతుంది’ అని చన్నీ ఆ వెంటనే వ్యాఖ్యానించడం విశేషం.

        

About Author