PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువతలో క్రీడాస్ఫూర్తి నింపేందుకే సీఎం కప్ పోటీలు: చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు : యువతలోక్రీడా స్ఫూర్తి నింపేందుకే సీఎం కప్ క్రీడా పోటీలని నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో శనివారం ఏపీ సీఎం కప్‌ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, శాప్ సీఈవో నాగరాజ నాయుడు, ఎంపీడీవో సుబ్రమణ్యం శర్మ, ఎంపీపీ మురళీ క్రిష్ణా రెడ్డి, జడ్పీటీసీ ఖాళీ మున్నిసా బేగం, తహశీల్దార్ రాజశేఖర్ బాబు లు ప్రారంభించారు.  అనంతరం వారు క్రీడా వందనం స్వీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పగిడ్యాల, జూపాడుబంగ్లా, మిడుతూరు, పాములపాడు, కొత్తపల్లి, నందికొట్కూరు  గ్రామీణ మండలాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడ్డారు. మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ  యువతలో క్రీడాస్ఫూర్తి నింపేందుకే సీఎం కప్‌ క్రీడా పోటీలని  పేర్కొన్నారు.క్రీడలతోనే క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల అలవడుతాయన్నారు. క్రీడలను, క్రీడాకారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మీద క్రీడలు జరపడం ఇదే తొలిసారని సంతోషం వ్యక్తం చేశారు.

విద్యార్థి శక్తి ఏంటో తనకు బాగా తెలుసన్నారు. సీఎం జగన్‌ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. శాప్ సీఈవో నాగరాజ నాయుడు మాట్లాడుతూ జాతీయ,అంతర్జాతీయ క్రీడాకారులు పాఠశాల స్ధాయి నుంచే ఎదిగారన్న విషయం యువత గుర్తుపెట్టుకోవాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ అంకిరెడ్డి ,ఎంపీపీ మురళీ క్రిష్ణా రెడ్డి,తహశీల్దార్ రాజశేఖర్ బాబు తదితరులు మాట్లాడారు. ముఖ్య అతిధులు, అధికారులు క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు.

కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తువ్వా శివరామ కృష్ణా రెడ్డి,నందికొట్కూరు జడ్పీటిసి కళీ మున్నిసా బేగం, పగిడ్యాల ఎంపీపీ మల్లేశ్వరి, జూపాడుబంగ్లా ఎంపీపీ సువర్ణమ్మ, ఎంపీడీఓ లు గౌరీదేవి, శోభారాణి, ఎంఇఓ పైజున్నిసా బేగం, సుభాన్ , మున్సిపల్ కౌన్సిలర్లు రూపాదేవి, రావుఫ్, లాల్ ప్రసాద్, సీఎం కప్ క్రీడల రాష్ట్ర కో ఆర్డినేటర్ ఏపీ రెడ్డి,జిల్లా కో ఆర్డినేటర్ స్వామిదాసు రవికుమార్, వ్యాయమఉపాద్యాయులు పెరుమాళ్ళ శ్రీనాథ్, వీరన్న, డోరతి ,వైసీపీ నాయకులు ఉస్మాన్ బేగ్, తదితరులు పాల్గొన్నారు.

About Author