NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`మేజ‌ర్`కు వెండి నాణెం ఇచ్చిన సీఎం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అడివి శేష్ న‌టించిన మేజ‌ర్ చిత్రబృందాన్ని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్‌ అభినందించారు. ‘మేజర్‌’ మంచి విజయం సాధించిన సందర్భంగా మేజర్‌ సందీప్ ఉన్ని కృష్ణన్‌ తల్లిదండ్రులతోపాటు మూవీ యూనిట్‌ను కలిసి ప్రశంసించారు. తర్వాత సినిమాలో 10 నిమిషాలను సీఎంకు చూపించి పూర్తి చిత్రాన్ని వీక్షించాలని వారు కోరారు. చిత్ర విశేషాలను సుధీర్ఘంగా చర్చించిన తర్వాత మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్‌ పేరును ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తాని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం చిత్రబృందానికి, మేజర్‌ సందీప్‌ తల్లిదండ్రులకు శాలువ కప్పి, వెండి నాణేన్ని జ్ఞాపికగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో మేజర్‌ సందీప్ ఉన్ని కృష్ణన్‌ తల్లిదండ్రులతోపాటు హీరో అడవి శేష్, నిర్మాత శరత్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

                                                  

About Author