NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

22న కర్నూలుకు సీఎం జగన్​ రాక..

1 min read

ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లో భద్రత ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్,  ఎస్పీ, జేసిలు

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఈ నెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాకు పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లో భద్రత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు.  ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ లో బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్ సంబంధిత అధికారులను  ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట ఎయిర్ పోర్ట్ డైరెక్టర్, కర్నూలు నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్, డిపిఓ ప్రభాకర్ రావు, కర్నూల్ ఆర్ డి ఓ హరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

About Author