NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చంద్రబాబు సంస్కారానికి నమస్కారాలు: సీఎం జగన్

1 min read


పల్లెవెలుగు వెబ్:
వరదలపై అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ వివరిస్తూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రకృతి విపత్తును కూడా రాజకీయంగా వాడుకునే ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. బాధితులకు సత్వరమే సాయం అందేలా చర్యలు చేపట్టామని సీఎం వెల్లడించారు. మాట తప్పను.. మడమ తిప్పనూ అన్న వ్యక్తి, మాట తప్పి మడప తిప్పాడని అన్న చంద్రబాబు వ్యాఖ్యలను జగన్ కోట్ చేస్తూ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. తాను మాట తప్పను.. మడమ తిప్పను అని జగన్ అన్నారు. నేను గాల్లోనే తిరుగుతూ.. గాల్లోనే కలిసి పోతానని.. ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగైతానని చంద్రబాబు అంటున్నాడని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు వెళ్లింది దేనికి.. మాట్లాడేంది ఏందని.. నిజంగా చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలు అని జగన్ అన్నారు. ఇప్పటికైనా కుటిల రాజకీయాలు మాని ప్రజలకు మంచి జరగాలని కోరుకోవాలని చంద్రబాబుకు సూచించారు.

About Author