NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘సీఎం జ‌గ‌న్, నేను పోటీ చేస్తే.. నేనే గెలుస్తా’ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : న‌ర‌సాపురంలో జ‌గ‌న్, తాను పోటీ చేస్తే ఎలా ఉంటుందో ఓ స‌ర్వే చేశార‌ని, ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏం జ‌రుగుతుందో ఆ స‌ర్వేలో తేలింద‌ని న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు చెప్పారు. జ‌గ‌న్, త‌న‌కు మ‌ధ్య కేవ‌లం 19 శాత‌మే తేడా ఉంద‌ని, త‌ప్పుడు ప్రచారం ఆపేందుకే స‌ర్వే వివ‌రాలు చెప్పాన‌ని ఆయ‌న అన్నారు. అమ‌ర‌రాజ బ్యాట‌రీస్ లో కాలుష్యం గురించి మాట్లాడుతున్నార‌ని, మ‌రి నాసిరకం మ‌ద్యం తాగి ప్రజ‌లు ప్రాణాలు కోల్పోవ‌డం గురించి ఎందుకు మాట్లాడ‌ర‌ని ర‌ఘురామ ప్రశ్నించారు. వైఎస్ వివేకాకు గుండెపోటు వ‌చ్చిన విష‌యం విజ‌య‌సాయి రెడ్డికి ఎలా తెలుస‌ని ప్రశ్నించారు. వివేకా హ‌త్య కేసులో సీబీఐ ముందుగా విజ‌య‌సాయిరెడ్డిని ప్రశ్నించాల‌ని కోరారు. ఢిల్లీలో జరిగిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

About Author